Friday 22nd November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

supreme court

Supreme Court Verdict On Article 370 | మ్మూ కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు పట్ల భారత సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని కొట్టి పారేయలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సంచలన తీర్పు  వెలువరించింది.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్దమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది.

జమ్మూ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం కేవలం రాజ్యాంగ వెసులుబాటుకోసమేనని వెల్లడించింది. ఆరోజు ఉన్న ప్రత్యేక పరిస్థితులు, యుద్ధం కారణంగా ఆర్టికల్ 370 ని తీసుకురావాల్సి వచ్చిందని పేర్కొంది. తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్ 370 ని ప్రవేశపెట్టారని సుప్రీంకోర్టు వెల్లడించింది.

కేంద్రం తీసుకునే ప్రతీ చర్యను సవాల్‌ చేయకూడదని ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే పక్షాలకు హితవు పలికింది. ఈ ఆర్టికల్ 370 రద్దు అంశంపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు 2 నుంచి నెలరోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపి, సెప్టెంబర్ 5న తీర్పు రిజర్వ్ చేసింది.

తాజాగా సోమవారం వెలువరించింది. ఈ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ సూర్యకాంత్‌లు మిగితా సభ్యులుగా ఉన్నారు.

You may also like
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా
అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి
వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions