Wednesday 4th December 2024
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్‌ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: మాజీ మంత్రి హరీశ్ రావు

కేసీఆర్‌ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: మాజీ మంత్రి హరీశ్ రావు

No one should come to hospital to see KCR

-ఆందోళన అవసరం లేదు… ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
-కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్న హరీశ్ రావు
-కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్న మాజీ మంత్రి

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చూడటానికి లేదా పరామర్శించడానికి ఎవరు కూడా ఆసుపత్రికి రావొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. హరీశ్ రావు యశోద ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రం వైద్యులు హిప్ రిప్లేస్‌మెంట్ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు.

You may also like
కలకలం..మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు
rgv
Pushpa 2 Tickets: సుబ్బారావు ఇడ్లీల కథ చెప్పిన ఆర్జీవీ!
మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో మూవీ.. ప్రీలుక్ వైరల్
earthquake
తెలంగాణలో పలు చోట్ల భూ ప్రకంపనలు.. ఎక్కడెక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions