రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. అయితే ఈసారి కూడా కీలక వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉంటాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
8న నిర్ణయాలను ప్రకటించనున్న గవర్నర్ దాస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. అయితే ఈసారి కూడా కీలక వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉంటాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతం వద్ద ఉన్నది. కరోనా సమయంలో దిగాలుపడిన వృద్ధిరేటును ఉత్సాహపర్చేందుకు రెపోను ఆర్బీఐ బాగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం ఎగిసి పడుతుండటంతో వరుసగా రెపోను పెంచుతూపోయిన సంగతీ విదితమే. ఈ క్రమంలోనే 250 బేసిస్ పాయింట్లు (2.5 శాతం) రెపో రేటు పెరిగింది. అయితే గతకొన్ని సమీక్షల నుంచి వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ ద్రవ్యసమీక్షలు ముగుస్తున్నాయి. ఈసారీ అదేబాటలో ఆర్బీఐ ఎంపీసీ సభ్యులు వెళ్తారన్న ఊహాగానాలైతే బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే వరుసగా ఐదోసారి వడ్డీరేట్లు యథాతథంగానే ఉండనున్నాయి.
రుణగ్రహీతలపై భారం కరోనా టైంలో వడ్డీరేట్లను ఆర్బీఐ భారీగా తగ్గించడాన్ని చూసినవారిలో చాలామంది గృహ, వాహన ఇతరత్రా రుణాలను తీసుకున్నారు. అయితే ఇప్పుడా రుణాలపై వడ్డీరేట్లు కరోనాకు ముందున్న స్థాయికి చేరుకున్నాయి. దీంతో రుణగ్రహీతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా వడ్డీరేట్లను సవరించే విధానమున్న లోన్లు కావడంతో రెపో పెరిగినప్పుడల్లా బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లనూ పెంచుతూపోతున్నాయి. ఫలితంగా అప్పులు తీసుకున్నవారిపై మోయలేనంత భారం పడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈసారైనా వడ్డీరేట్లు తగ్గుతాయా? అన్న ఆశతో అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్బీఐ ఏం చేస్తుందో చూడాలి.