Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవం.. కేసీఆర్, వైఎస్ జగన్ లకు ఆహ్వానం!

రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవం.. కేసీఆర్, వైఎస్ జగన్ లకు ఆహ్వానం!

revanth reddy

Revanth Invites KCR and Jagan | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకలను రేవంత్‌రెడ్డి తన ప్రమాణస్వీకారోత్సవానికి స్వయంగా ఆహ్వానించారు.

ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, తెదేపా అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు.  

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు పంపారు. సీనియర్‌ నేతలు చిదంబరం, అశోక్‌ గహ్లోత్‌, దిగ్విజయ్‌ సింగ్‌, వీరప్ప మొయిలీ, మీరాకుమార్‌, కుంతియా, భూపేష్‌ బఘేల్‌, అశోక్‌ చవాన్‌, వాయలార్‌ రవి, సుశీల్‌కుమార్‌ శిందే, మాణికం ఠాగూర్‌, కురియన్‌లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కంచె ఐలయ్యలతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆహ్వానాలు పంపారు. 

You may also like
cm revanth visits vemulawada
వేములవాడలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు!
eatala rajendar
లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ నాయకులదే: ఈటల రాజేందర్!
srikanth sravya
సీఎం గారూ మా పెళ్లికి రండి: శ్రీకాంత్-శ్రావ్య!
ktr comments
మంత్రుల ఫోన్  ట్యాప్ చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions