Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > తాజా > ఓటేయడానికి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు రామ్ చరణ్!

ఓటేయడానికి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు రామ్ చరణ్!

Ram Charan

Ram Charan | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) నవంబర్ 30న జరగనున్న విషయం తెల్సిందే.

దింతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు.

సామాన్యులతో పాటే సెలెబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ చేరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా తన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి హైదరాబాద్ చేరుకున్నారు.

ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో రాం చరణ్, కియరా అద్వానీ (Kiara Advani) జంటగా గేమ్ చేంజర్ (Game Changer) మూవీ తెరకెక్కుతోంది.

తాజాగా కర్ణాటక లోని మైసూర్ (Mysore) ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

అయితే షూటింగ్ లో బిజీ గా ఉన్నప్పటికీ నవంబర్ 30న ఎన్నికల్లో ఓటు ను వేయడం కోసం స్పెషల్ ఫ్లైట్ లో బుధవారం మైసూర్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు రాం చరణ్.

ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఓటు వేయడం కోసం రాం చరణ్ హైదరాబాద్ రావడంతో ఓటు హక్కు పై సమాజంలో మంచి అవగాహన కల్పించినట్లైంది.

You may also like
rajagopal raju
టాలీవుడ్ నటుడు రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదం!
senior actress b saroja devi passes away
సీనియర్ నటి సరోజా దేవి కన్నుమూత!
కోట శ్రీనివాసరావు ఇకలేరు
AA 22..నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్ ?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions