Kavitha Fires On Congress | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) పోలింగ్ దగ్గర పడుతుండటంతో వినూత్న రీతిలో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నేతలు.
ఇందులో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలు తాము ప్రకటించిన హామీలను, నియోజకవర్గాల్లో అభివృద్ధిని చేసి తీరుతాం అంటూ బాండ్ పేపర్లు (Bond Papers) రాసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ, బీఆరెస్ నాయకురాలు కవిత (Kalvakuntla Kavitha).
మంగళవారం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ లతో కొత్త తరహా డ్రామాలకు తెర తీస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతోనే జీవన్ రెడ్డి (Jeevan Reddy), సుదర్శన్ రెడ్డి, భట్టి (Bhatti Vikramarka) లాంటి నాయకులు కూడా బాండ్ పేపర్లు రాసిచ్చే పరోస్థితికి దిగజారి పోయారని మండిపడ్డారు.
137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ స్థాయికి దిగజారిపోవడం ఏంటని ప్రశ్నించారు.
కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి డ్రామాలే చేసి గెలిచిందని, బాండ్ పేపర్లు రాసిచ్చిన ప్రకటించిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేక పోయిందని ఆరోపించారు.