Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > రైతు బంధు నిలిపివేత.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

రైతు బంధు నిలిపివేత.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

revanth reddy

Revanth Reddy Comments On Rythu Bandu | తెలంగాణ ఎన్నికల వేళ రైతు బంధు (Rythu Bandhu) పంపిణీని నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో బీఆరెస్ (BRS) మరియు కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాగా రైతు బంధు నిలిపివేత పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

” రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు.

హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు  ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.

ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం.” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

You may also like
Election commission
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
cm revanth reddy
టీ-హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు.. స్పందించిన సీఎం!
tg cabinet meeting
MuniciPolls: మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం!
cm revanth reddy
విద్యార్థిగా మారునున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎక్కడో తెలుసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions