Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > క్రైమ్ > దారుణం.. కూతుళ్లపై సవతి తండ్రి లైంగిక దాడి!

దారుణం.. కూతుళ్లపై సవతి తండ్రి లైంగిక దాడి!

Girl

Step Father Sexual Assault | కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే పిల్లల పాలిట పిశాచి లాగా ప్రవర్తించాడు. ఇందుకు తల్లి కూడా సహకరించడం పట్ల అందరూ విస్తుపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులో దారుణం చోటు చేసుకుంది. తన మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు కుతుర్లని రెండవ భర్త పరం చేసింది ఓ మహిళ.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ మహిళ మొదటి భర్త 2007 సంవత్సరంలో అనారోగ్యంతో మరణించాడు.

తర్వాత ఆమె తన మేనత్త కొడుకు సతీష్అ నే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. కానీ అప్పటికే ఆ మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కొన్ని రోజుల తర్వాత సతీష్ తనకు పిల్లలు కావాలని ,లేదంటే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు. కానీ తనకు పిల్లలు పుట్టరని ఆ మహిళ చెప్పే ప్రయత్నం చేసినా సతీష్ వినిపించుకోలేదు.

సతీష్ ఎక్కడ రెండో పెళ్లి చేసుకుంటాడనే భయం తో వయసుకువచ్చిన తన కుమార్తలతో పిల్లలని కనాలని మహిళ ఒప్పించింది.

2017 లో 17 ఏళ్ళ పెద్ద కుమార్తె ఒక ఆడ శిశువును జన్మనిచ్చింది. తర్వాత మగపిల్లవాడికోసం రెండో కుమార్తెను సతీష్ కు అప్పగించింది.

సంవత్సరం క్రితం మగ బిడ్డ పుట్టి మరణించాడు. ఆ బిడ్డ శవాన్ని కాలువాలో పడేశారు. ఇటీవల భర్తతో విబేధాలు రావడంతో కుతుర్లని గ్రామంలోనే వదిలేసి విశాఖలోని పుట్టింటికి వెళ్ళిపోయింది.

చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడితో ఇదంతా చెప్పడంతో అతడు పిల్ల మేన మామకు విషాయాన్ని తెలిపాడు.

బాధితులతో కలిసి దిశ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు మేనమామ. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

You may also like
కత్తితో పొడిచి రక్తపు మడుగులోనే తాళి కట్టిన ప్రేమోన్మాది !
bed
ఫస్ట్ నైట్ గదిలోకి కత్తితో వెళ్లిన భార్య.. ఏమైందంటే!
amritha pranay
ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు!
komatireddy venkat reddy
హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions