Friday 30th January 2026
12:07:03 PM
Home > తెలంగాణ > గానుగాపూర్ కు ఆర్టీసీ స్పెషల్ బస్.. టికెట్ ధర ఎంతంటే!

గానుగాపూర్ కు ఆర్టీసీ స్పెషల్ బస్.. టికెట్ ధర ఎంతంటే!

tsrtc

TSRTC Special Bus: కొంతకాలంగా అద్భుతమైన ఆఫర్లు, కొత్త ప్యాకేజీలతో ప్రయాణీకులను ఆకర్షిస్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మరో శుభవార్త చెప్పింది.

భక్తుల సౌకర్యార్థ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 17న అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని గానుగాపూర్‌ (Ganugapur) దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది.

ఈ గానుగాపూర్‌తో పాటు మహారాష్ట్రలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌ లకు కూడా ఈ ప్రత్యేక బస్సును సంస్థ నడుపుతోంది.
సర్వీసు నంబరు 92221 గల  స్పెషల్ సర్వీస్ జూలై 16న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ లోని ఎంజీబీఎస్‌ నుంచి గానుగాపూర్‌కు బయలుదేరుతుంది.

17న ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనానంతం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి మహారాష్ట్రలోని బయలుదేరుతుంది.

సాయంత్రం 4 గంటలకు పండరీపూర్‌ చేరుకుంటుంది. పాండురంగస్వామి దర్శనానంతరం రాత్రి 10 గంటలకు తుల్జాపూర్‌కు వెళ్తుంది.

తుల్జా భవాని మాత దర్శనానంతరం 18న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. రాత్రి 8.30 గంటలకల్లా ఎంజీబీఎస్‌కు చేరుకుంటుంది.

Read Also:  అమెరికాకు కేంద్ర మంత్రి.. కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం!

బస్ టికెట్ ధర ఎంతంటే..

భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ బస్ టికెట్ ధరను రూ.2500గా టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

అయితే ఈ ధరలో కేవలం ప్రయాణ సదుపాయం మాత్రమే సంస్థ కల్పిస్తోంది. దర్శనం, భోజనం, వసతి సదుపాయాల బాధ్యత భక్తులదే.

టికెట్ బుక్ చేసుకోండిలా..

టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.in లో గానుగాపూర్‌ స్పెషల్ బస్‌ ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్ నగర్ బస్ స్టేషన్లలోని కౌంటర్లలో ఈ టికెట్లను పొందవచ్చు.

ఈ ప్రత్యేక బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలకు 9440566379, 9959226257, 9959224911 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions