Monday 21st April 2025
12:07:03 PM
Home > తెలంగాణ > “కాంగ్రెస్ లో కోవర్ట్ లు ఉన్నారు” రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు!

“కాంగ్రెస్ లో కోవర్ట్ లు ఉన్నారు” రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు!

Renuka Chowdary

Renuka Chowdary Sensational Comments | కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ కాంగ్రెస్ ఫార్టీ ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి (Renuka Chowdary) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో పొంగులేటితో భేటీ అనంతరం మీడియా తో మాట్లాడిన రేణుక పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చారు.

రేణుక చౌదరి ఏమన్నది??

పొంగులేటి తో భేటీ అనంతరం మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణుక మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల పైన, కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతుందని పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

మీ పార్టీ లో కోవర్టులు ఉన్నారా? అనే ప్రశ్నకు రేణుక చౌదరి నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ లో కోవర్టులు ఉన్నారనీ.. కేవలం మా పార్టీలోనే కాదు ప్రతి రాజకీయ పార్టీ లోను కోవర్టులు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.

అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ పార్టీ లోకి వస్తే తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో సీట్లు అధిష్టానం నిర్ణయిస్తుందని కుండబద్దలు కొట్టారు.

బండికి స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఆదివారం జరిగిన నాగర్ కర్నూల్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని కేసీఆర్ నిర్ణయిస్తాడని వ్యాఖ్యానించారు.

అలాగే వారికి ప్రతి నెల పాకెట్ మనీ కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ చేసిన ఈ కామెంట్లపై రేణుక చౌదరి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

తమ పార్టీ గురుంచి వదిలేసి బీజేపీ గురించి ఆలోచించాలని, తమ పార్టీ లోని వారు బయటకి పోకుండా కాపాడుకోవాలని సలహా ఇచ్చారు.

అలాగే కాంగ్రెస్ వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తుంటే బండి సంజయ్ ఏమైనా చూశారా అని తిరిగి ప్రశ్నించారు. అలాగే ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వస్తే మంచిది అని ఆశా భావాన్ని వ్యక్తపరిచారు.

కాంగ్రెస్ లో కోవర్టులు..

ఇదిలా ఉండగా రేణుక చౌదరి కోవర్ట్ లని ఉద్దేశించి చేసిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. అన్ని పార్టీల తో పాటు కాంగ్రెస్ లో కూడా కోవర్టులు ఉన్నారని ఆమె అన్నారు.

మరి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేస్తున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

“కర్ణాటక ఎన్నికల తర్వాత వేగం పెంచిన కాంగ్రెస్ కి ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనేది వేచి చూడాలి.

కోవర్టు అనే అంశాన్ని ఉద్దేశిస్తూ రేణుక చౌదరి  సొంత పార్టీ లో గెలవలేక వేరే పార్టీ కి ఊడిగం చేస్తున్నారు.

అలాంటి వారితో పార్టీ కి ఎటువంటి సమస్యా లేదు. కేవలం వారి వల్ల తలనొప్పి మాత్రమే” అని అన్నారు.

మరి రేణుక చౌదరి కి తెలిసిన ఈ కోవర్టులు పార్టీ అధిష్టానానికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారికి తెలీదా?

లేదా తెలిసి కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా?? అనే ప్రశ్నలు పార్టీని వెంటాడుతున్నాయి.

నల్లగొండ ఎంపీ, మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని వీడి బీఆరెస్ లోకి వెళ్తున్నారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అలాంటి  సమయంలో రేణుక చౌదరి కోవర్టులు అనే విషయాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

You may also like
BJP Kishan REddy
ఆ అవసరం మాకు లేదు.. కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్!
mahesh goud
‘ఎమ్మెల్యేలు సంతలో పశువులు కాదు..’
komatireddy venkat reddy
హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్?
kcr revanth
కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions