Vijayashanti Counter To Thackery | అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ఆరునెలల ముందే తెలంగాణ రాజకీయాల్లో ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది.
ప్రధాన పార్టీల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతర్గత కుమ్ములాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ (Telangana Congress) నేతల్లో ఐక్యత కనిపిస్తోంది.
క్రమశిక్షణకు మారు పేరైన బీజేపీలో (BJP Telangana) మాత్రం నాయకుల మధ్య విభేదాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలను గమనిస్తూ బీఆరెస్ తన పని తాను చేసుకుంటూ పోతోంది.
ముఖ్యంతా తెలంగాణలో మైండ్ గేమ్ పాలిటిక్స్ (Mind Game Politics) నడుస్తున్న సూచనలు బాగా కనిపిస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త వ్యూహాలు పన్నుతోంది.
రాష్ట్రంలో అధికార పార్టీ బీఆరెస్ కంటే ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకొంటున్న బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది.
Read Also: బీజేపీ పెద్దలతో కేటీఆర్ భేటీ.. ఢిల్లీ నుంచి ఈటల, కోమటిరెడ్డికి పిలుపు!
బీఆరెస్ నుంచి పలు కారణాలతో బయటకు వచ్చి, కాషాయ తీర్థం పుచ్చుకున్న నాయకులకు హస్తం పార్టీ నేతలు గాలం వేస్తున్నారు.
ముఖ్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను కాంగ్రెస్ లో చేరాలంటూ పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నారు.
వీరికి తోడు తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి (Vijayshanti), డీకే అరుణతో (DK Aruna) కూడా తమతో చర్చలు జరుపుతున్నామంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే (Manik Rao Thackeray) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చేరిక ఖాయం అయిపోయిందనీ, పలువురు బీఆరెస్ నేతలు కూడా త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకొంటారని వ్యాఖ్యానించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరిన నేతలు అక్కడ ఇమడలేకపోతున్నరనీ, తిరిగి తమ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బాంబు పేల్చారు.
ఏకంగా బీజేపీలో చేరిన నేతల పేర్లు కూడా ప్రస్తావించడంతో కాషాయ పార్టీలో అలజడి రేగింది.
నిజంగా కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం లేకపోయినప్పటికీ, హస్తం నేతల మైండ్ గేమ్ తో బీజేపీలో అంతర్గత విబేధాలు మరింత పెంచి, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు.
Also Read: అమిత్ షా-కేటీఆర్ భేటీ.. బీజేపీ-బీఆరెస్ బంధానికి దారితీస్తుందా!
అందుకు ఎక్కువగా బీజేపీనే టార్గెట్ చేసింది టీ కాంగ్రెస్. ఈ క్రమంలో విజయశాంతితోనూ చర్చలు జరుపుతున్నామని మాణిక్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు రాములమ్మ.
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు మతి భ్రమించినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయశాంతితో చర్చలంటూ లీకేజీలిస్తూ, అవాస్తవాలు మాట్లాడటం పిచ్చి వాగుడు అవుతుందని హెచ్చరించారు. మాణిక్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.