Ys Jagan News Latest | విద్యార్థి దశలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.
అందుకే ఇప్పుడు ప్రతీకారంగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని చంద్రబాబు జైల్లో పెట్టించాడని ఆరోపించారు. గురువారం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ అయ్యారు.
అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..విద్యార్థి దశలో ఎవరైనా ఉడుకు రక్తంతోనే ఉంటారని, ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి, చంద్రబాబును కొట్టారని జగన్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు శాడిజం ప్రదర్శిస్తూ పెద్దిరెడ్డి కుమారుడిపై అక్రమ కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఏమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడ్డారు. తన పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డురంగా ఉందన్నారు.









