Saturday 9th August 2025
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున-అమల.. కారణమేంటంటే!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున-అమల.. కారణమేంటంటే!

Akkineni Nagarjuna Meets CM Revanth Reddy | టాలీవుడ్ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున తన సతీమణి అమలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారి కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం త్వరలో జరగనుంది.

ఈ నేపథ్యంలో నాగార్జున దంపతులు శనివారం జూబ్లిహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. అఖిల్ వివాహ వేడుకు రావాల్సిందిగా నాగార్జున అమల దంపతులు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

గత కొంతకాలంగా అఖిల్, థియేటర్ ఆర్టీస్ట్, పెయింటర్ అయిన జైనబ్ రవ్జీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. జూన్ మొదటి వారంలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అఖిల్ అక్కినేని ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

You may also like
cm revanth reddy
రాఖీ పండుగ సందర్భంగాఆడపడుచుల కోసం కొత్త పథకం!
rakhee pournami
మంత్రులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క!
vijay deverakonda
రేపు Kingdom విడుదల.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!
‘భర్త, కుమారుడి పేరు మీద యూరియా..మహిళా రైతుపై కేసు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions