Vijayamma Comments YS Jagan | వైఎస్సార్ (YSR) కుటుంబంలో ఆస్తుల చిచ్చు ఇప్పుడు మరో మలుపు తిరిగింది.
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తల్లి వైఎస్ విజయమ్మ గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆస్తుల పంపకం విషయంలో జగన్ తన సోదరి షర్మిలకు, ఆమె పిల్లలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ శుక్రవారం ఒక మీడియా నోటరీని విడుదల చేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, వాటి పంపకం ఇప్పటివరకు అధికారికంగా జరగలేదని విజయమ్మ స్పష్టం చేశారు.
తన నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు ఆస్తులను సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ గారి సంకల్పమని ఆమె వెల్లడించారు.
ఎంఓయూ (MoU)లో పేర్కొన్న ప్రతి ఆస్తి న్యాయంగా షర్మిలకు చెందాలని, సరస్వతి సిమెంట్స్ మరియు యెలహంక భూమి కూడా ఆమెదేనని విజయమ్మ పేర్కొన్నారు.
జగన్ తన సోదరికి ఇచ్చినట్లు చెబుతున్న డబ్బు వాటా కింద ఇచ్చిన ‘డివిడెంట్’ మాత్రమే తప్ప, ఆస్తి పంపకం కాదని ఆమె వివరించారు.
ఇప్పటివరకు మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం జరిగిందని, ఇకనైనా జగన్ మనసు మార్చుకుని న్యాయం చేస్తారని తల్లిగా ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆస్తి పంపకం జరిగిందని సాగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవాలని, ఇలాంటి అసత్యాలను మానుకోవాలని ఆమె కోరారు.
విజయమ్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.






