Ys Jagan Fires On Cm Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులుచెరిగారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. పంటలకు ధరల పతనంలో చంద్రబాబు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని ఎద్దేవా చేశారు.
కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? అని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు నిరక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు.
క్వింటా ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేశారని, కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారని ధ్వజమెత్తారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారని జగన్ అడిగారు. మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదని నిలదీశారు. ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయమన్నారు.









