YCP MP Vijaysai Reddy | ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి (Vijaysai Reddy). చంద్రబాబు మళ్లీ తన ఫక్తు రాజకీయ క్రీడలకు తెరతీశాడని తెలిపారు.
ఈసారి చంద్రబాబు వడ్డించిన చీవాట్లు, పరుషమైన దూషణలు, తిట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులే తాజా టార్గెట్ కావడం, అది వారి పుణ్యమో లేదా దురదృష్టమో కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశం, ఈ కీలక శాఖలన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్వహించేవేనని అనుమానం వ్యక్తంచేశారు.
తద్వారా చంద్రబాబు చాలా తెలివిగా నిందను పవన్ కల్యాణ్‌పైకి పరోక్షంగా నెట్టివేస్తున్నారని, ఈ తరహా నక్క తెలివితేటలతో పవన్ విశ్వసనీయతను దెబ్బదీయడమే సీఎం లక్ష్యమని వేరే చెప్పాల్సిన పనిలేదన్నారు.
ఇది చంద్రబాబు మార్కు రాజకీయం. అంతేకాదు, 2014, 2024 ఎన్నికల్లో తన విజయానికి తాను ఏ నాయకుడి జనాదరణను అత్యధికంగా ఉపయోగించుకున్నా ఆ నాయకుడి పేరు ప్రతిష్ఠలను మంటగలపడమే చంద్రబాబు ఎత్తుగడ.
భవిష్యత్తులో తన కుమారుడికి ముప్పుగా పరిణమిస్తుందనే బలీయమైనశక్తిని అణచివేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్న తన ట్రేడ్ మార్కు వ్యూహం అంటూ సీఎంపై విజయసాయి రెడ్డి ఆరోపణలు గుప్పించారు.