YCP Allegations On Bhuma Akhila Priya | ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియపై సంచలన ఆరోపణలు చేసింది వైసీపీ. నియోజకవర్గంలోని చికెన్ షాపులను వదలడం లేదని, ప్రతీ కిలో చికెన్ కు రూ.10 మామూళ్లు వసూలు చేస్తున్నారని జగన్ పార్టీ ఆరోపించింది.
కిలో చికెన్ కు రూ.10 రౌడీ మామూళ్లు ఇవ్వాల్సిందే, తాము చెప్పిన ఫారం నుండే కోళ్లు కొనాలని లేదంటే అధికారుల నోటీసులతో దాడులు చేస్తామని భూమా అఖిలప్రియ భర్త దౌర్జన్యం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఆరోపించింది.
అంతేకాకుండా రూ.కోటి ఇవ్వాలని హోల్ సేల్ వ్యాపారిని బెదిరించారని పేర్కొంది.తెలుగుదేశం నాయకుల కక్కుర్తి పరాకాష్టకు చేరింది. కూటమి ఎమ్మెల్యేలు పనులు, కాంట్రాక్టులు మాత్రమే కాకుండా వీధి వ్యాపారులు, చికెన్ కొట్లను సైతం వదలడం లేదని జగన్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.