Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > WWE లెజెండ్ హల్క్ హోగన్ మృతి

WWE లెజెండ్ హల్క్ హోగన్ మృతి

Hulk Hogan Dies At 71 | వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ లెజెండ్ హల్క్ హోగన్ కన్నుమూశారు. అమెరికా ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో హల్క్ హోగన్ గుండెపోటుకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే వైద్య బృందం క్లియర్ వాటర్ బీచ్ లోని ఆయన నివాసానికి చేరుకుని స్థానిక ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే హల్క్ హోగన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హోగన్ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాళులర్పించారు.

హల్క్ తనకు గొప్ప స్నేహితుడని పేర్కొన్నారు. హోగన్ అసలు పేరు టెర్రీ బొల్లియా. 1953 ఆగస్ట్ 11న ఫ్లోరిడాలో జన్మించారు. 1980ల్లో డబ్ల్యూడబ్ల్యూఈ లో హల్క్ హోగన్ గా పేరు సంపాదించుకున్నారు. హోగన్ ఆరు సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గా నిలిచాడు.

ఈ క్రమంలో డబ్ల్యూడబ్ల్యూఈ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో కీలక పాత్ర పోషించారు. అనంతరం పలు హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హల్క్ హోగన్ డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions