Vinod Kamble Video | టీమ్ండియా (Team India) మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ (Vinod Kamble) కొద్ది రోజుల కిందట తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన థానేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వైద్య పరీక్షలు నిర్వహించగా అతని మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు డాక్టర్లు గుర్తించారు. చికిత్స తర్వాత కాంబ్లీ మెల్లగా కోలుకుంటున్నాడు.
తాజాగా ఆయన ఆసుపత్రి సిబ్బందితో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేశాడు. ‘చక్ దే ఇండియా’ పాటకు స్టెప్పులేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ మంచి స్నేహితులు. 1988లో స్కూల్ లెవెల్ క్రికెట్‌లో సచిన్-కాంబ్లీ జోడీ ప్రపంచ రికార్డు సృష్టించింది.
హారిస్ షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అందులో కాంబ్లీ 349 పరుగులు చేస్తే, సచిన్ 326 పరుగులు చేశారు. ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు.