Saturday 14th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికా అధ్యక్షుడి జీత భత్యం ఎంతుంటుందో తెలుసా!

అమెరికా అధ్యక్షుడి జీత భత్యం ఎంతుంటుందో తెలుసా!

white house

US President Salary | ప్రపంచం మొత్తం అమెరికా (America)లో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలవైపు చూస్తోంది. డెమొక్రటిక్ పార్టీ (Democratic Party)తరఫున కమలా హ్యారీస్ (Kamala Harris), రిపబ్లికన్ పార్టీ (Republican Party) తరఫున డోనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్నారు. నవంబర్ నెలలో అమెరికా అధ్యక్షుడు ఎవరు అనేది తేలిపోతుంది.

ఈ క్రమంలో అసలు అమెరికా అధ్యక్షుడి జీతభత్యాల గురించి ఆసక్తి నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Jeo Biden) కు వార్షిక వేతనం 4 లక్షల డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ. 3.40 కోట్లు. ఇవి కాకుండా 50 వేల డాలర్లు అంటే రూ.42 లక్షల వరకు అధ్యక్షుని ఖర్చుల కోసం ఇస్తారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో నివాసం ఉంటారు. ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం వైట్ హౌస్ లో రీ మోడలింగ్ కోసం మరో లక్ష డాలర్లు కేటాయిస్తారు. సిబ్బంది, వంటవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ కోసం ఏడాదికి 19 వేల డాలర్లు అంటే రూ.16 లక్షలు అదనంగా లభిస్తుంది.

ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు ఇస్తారు. అంతేకాకుండా లిమో కార్, మెరైన్ హెలికాప్టర్, ఎయిర్ ఫోర్స్ వన్ వంటి అత్యాధునిక వాహనాల్లో ప్రయాణించే సౌకర్యం లభిస్తుంది.

ప్రెసిడెంట్ పదవీ విరమణ తర్వాత ఏడాదికి 2 లక్షల 40 వేల డాలర్లు పెన్షన్ రూపంలో లభిస్తుంది. ఇదిలా ఉండగా సంపన్న అధ్యక్షులు అయిన జాన్ ఎఫ్ కెన్నడి, హెర్బర్ట్ హువర్, డోనాల్డ్ ట్రంప్ తమ వేతనాలను చారిటీకి ఇచ్చారు.

You may also like
కాబోయే అమెరికా ప్రెసిడెంట్ ఎవరో చెప్పేసిన బేబీ హిప్పో
US Elections: పోలింగ్ మంగళవారమే ఎందుకు జరుగుతుందంటే!
trump wins
హిందువులపై దాడులు..డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions