- రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్!
Bandi Sanjay | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారతీయ జనతాపార్టీపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar). బీజేపీని సీఎం “బ్రిటిష్ జనతా పార్టీ”గా అభివర్ణించడాన్ని తప్పుబట్టారు.
అదే సమయంలో కాంగ్రెస్ను ఒక బ్రిటిష్ అధికారి స్థాపించిన విషయాన్ని సీఎం మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పేరు INC అంటే “ఇటలి నేషనల్ కాంగ్రెస్”లా మారిందని సెటైర్లు వేశారు. ఉపాధి హామీ పథకం పేరు గురించి కాంగ్రెస్ ఆందోళన చెందడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.
గాంధీజీ నిజంగా కోరుకున్నది ఏంటన్నదే ముఖ్యం అని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ను రద్దు చేయాలని గాంధీజీ చెప్పారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తూ ఆయన ఆశయాన్ని నెరవేర్చుతున్నారని తెలిపారు.
“విభజించి పాలించు” అంటూ కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదమని, ఓట్ల కోసం కులం, మతం పేరుతో ప్రజలను కాంగ్రెస్ విభజిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” మార్గంలో పనిచేస్తోందని తెలిపారు.
ఇళ్లు, రేషన్, గ్యాస్ వంటి పథకాలు మతభేదం లేకుండా పేదలందరికీ అందుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ 70 ఏళ్లుగా పెంచిన బానిస మనస్తత్వాన్ని బీజేపీ తొలగిస్తోందన్నారు. స్కిల్స్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సు ప్రారంభించాలని, ఆ కోర్సులో మొదటి విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి చేరాలని సూచించారు. రాజకీయ నైపుణ్యంలో లోపం కనిపిస్తోందని విమర్శించారు.










