AP Deputy Speaker | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ (AP Assembly Deputy Speaker) గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) బాధ్యతలు చేపట్టారు.
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన ఆయన్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.
అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి రఘురామకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో నాటు నాటు పాట ఎంత ఫేమసో రఘురామ కృష్ణంరాజు యొక్క రచ్చబండ ప్రోగ్రాం కూడా అంతే ఫెమస్ అని పేర్కొన్నారు. తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిడుతనం తెచ్చారని కొనియాడారు.