TVK Chief Vijay About Parandur Airport | తమిళనాడు నాడు స్టార్ నటుడు దళపతి విజయ్ ( Thalapathy Vijay ) తమిళగ వెట్రి కళగం ( Tamilaga Vettri Kazhagam ) పార్టీని స్థాపించి రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.
అయితే రాజకీయ పార్టీని ప్రకటించిన అనంతరం విజయ్ తొలిసారి జనం మధ్యకు వచ్చి నిరసన తెలిపారు. చెన్నైలో ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయంగా శివారు కాంచీపురం జిల్లా పరందూర్ ( Parandur ) పరిసరాల్లో నూతన ఎయిర్పోర్ట్ ను నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి.
కానీ ఈ ఎయిర్పోర్ట్ వల్ల తమ భూముల్ని కోల్పోవడమే కాకా, స్థానిక చెరువులు కుంటలు నాశనం అవుతాయని అక్కడి రైతులు ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పరందూర్ తో పాటు మరో 13 గ్రామాల ప్రజలు గత 900 రోజులుగా నూతన ఎయిర్పోర్ట్ ఏర్పాటును వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజగా విజయ్ సోమవారం మేల్ పొడవూరు గ్రామానికి చేరుకుని నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావం తెలిపారు. తన రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడి నుండే మొదలుపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఎయిర్పోర్ట్ కోసం 90 శాతం భూముల్ని రైతుల నుండే తీసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక చెరువులు, కుంటల్ని నాశనం చేసే ఎయిర్పోర్ట్ తమకు వద్దని స్పష్టం చేశారు.