Thursday 21st November 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మూడు గంటల్లోనే శ్రీనివాసుడి దర్శనం.. టీటీడీ కీలక నిర్ణయం!

మూడు గంటల్లోనే శ్రీనివాసుడి దర్శనం.. టీటీడీ కీలక నిర్ణయం!

ttd

TTD New Updates | తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devastanam) చైర్మన్ గా ఇటీవల బీఆర్ నాయుడు (BR Naidu) ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం టీటీడీ నూతన చైర్మన్ అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

శ్రీవాణి ట్రస్టును (Srivani Trust) రద్దు చేసి.. వేరొక ట్రస్టులో విలీనం చేయనున్నట్లు టీటీడీ తెలిపారు. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

సామాన్యులకు 3 గంటల్లోనే దర్శనం..

శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఊరటనిచ్చేలా టీటీడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులకు కేవలం మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఛైర్మన్  తెలిపారు.

ఇక టీటీడీలోని అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతామన్న బీఆర్ నాయుడు.. వారు విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తామన్నారు. లేకపోతే ఇతర శాఖలకు బదిలీ చేస్తామని వెల్లడించారు.

తిరుపతిలోని శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మార్చినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. 20 ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్ట్ ఇచ్చారనీ,  ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. అయితే ఆ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

రాజకీయ ప్రసంగాలు నిషిద్ధం..

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో రాజకీయాలను దూరంగా ఉంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపింది.

నిత్యాన్నదానాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని.. మెనూలో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులో తీసుకొస్తామని తెలిపింది. అలాగే టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు రూ.17,400, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.7530 బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే విశాఖ శారదాపీఠానికి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి.. టీటీడీ స్వాధీనం చేసుకోనుంది.

You may also like
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం పవన్ సార్
అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !
ఝార్ఖండ్ ఎవరి సొంతం !
మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకోబోయేది ఎవరంటే !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions