Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > నాకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే..: నటి శ్రీలీల!

నాకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే..: నటి శ్రీలీల!

sreeleela

Sreeleela About Her Crush Qualities | టాలీవుడ్ లో వరుస అవకాశాలతో టాప్ గేర్ లో దూసుకుపోతోంది పదహారణాల తెలుగమ్మాయి శ్రీలీల.

ప్రస్తుతం ఆమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో  రెండు మూడు ప్రాజెక్టులు షూటింగ్ లో ఉన్నాయి.

ఇదిలా ఉండగా, తనకు కాబోయే భర్త ఎలా ఉండాలీ.. ఏమేం క్వాలీటీస్ ఉండాలీ.. లాంటి అంశాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అందాలభామ శ్రీలీల.

‘నన్ను పెళ్లి చేసుకోబోయేవాడికి ముచ్చటగా మూడు లక్షణాలుండాలి. అవి కూడా చాలా సింపుల్‌ క్వాలిటీస్.

ఫస్ట్.. కొన్ని విషయాల్లో నన్ను భరించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించాలి.. భరించాలి. రెండోది.. తనకు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి.. సరదాగా నవ్విస్తుండాలి..

మూడోది.. కాస్త ఫ్యామిలీ టైప్‌గా పద్దతిగా అందంగా ఉండాలి. ఈ మూడు గుణాలు ఉంటే చాలు.’ అంటూ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది శ్రీలీల.

ఇప్పటి వరకు అలాంటి వాడు తనకు తారసపడలేదనీ, ఒక వేళ కనిపించినా కాన్సన్‌ట్రేట్‌ చేసేంత టైమ్‌ తనకు లేదని చెప్పింది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions