Tirumala Hundi Income 2024 | నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది ఉంది. ఎప్పటి వలే సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా గత ఏడాది 2024 కు సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది.
2024లో మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు వేంకటేశుడిని దర్శించుకున్నారని తెలిపింది అందులో 99 లక్షల మంది తల నీలాలు సమర్పించారని వెల్లడించింది. 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపింది. 12.14 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.