Tirumala Laddu History | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూ చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది.
లడ్డూలో జంతు కొవ్వును వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో అసలు తిరుమలలో ప్రసాదంగా లడ్డూను ఎప్పటి నుండి అందిస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది.
1804 సంవత్సరం వరకు బూందీని తీపి ప్రసాదంగా తిరుమలలో పంచినట్లు ఆలయ పండితులు చెబుతున్నారు. కాలక్రమనే 1940 దశకం నాటికి తిరుమలలో లడ్డూను ప్రసాదంగా భక్తులకు అందించడం ప్రారంభం అయ్యింది.
విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. మరోవైపు తిరుమల దేవస్థానంలో ప్రత్యేకంగా మూడు రకాల లడ్డులను తయారుచేస్తారు.
కళ్యాణం లడ్డూ లేదా పెద్ద లడ్డూ, రెండవది ఆస్థానం లడ్డూ వీటిని ఆలయంలో జరిగే ఆస్థాన సమయంలో తయారుచేస్తారు. మూడవది చిన్న లడ్డూ. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు ఈ లడ్డూలనే అందిస్తారు.