Wednesday 18th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > స్విమ్మింగ్ ఫూల్ లో మునిగి ముగ్గురు యువతులు మృతి!

స్విమ్మింగ్ ఫూల్ లో మునిగి ముగ్గురు యువతులు మృతి!

drowning in swimming pool

  • కర్ణాటక మంగూళూరులోని ఓ రిసార్ట్ లో ఘటన
  • ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియో

3 Women Drown in Swimming Pool | కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఓ రిసార్ట్‌ లో (Mangaluru Resort) తీవ్ర విషాదం చేసుకుంది. ఈత రాకపోవడంతో ఓ రిసార్ట్‌ లోని స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మరణించారు.  

మైసూరుకు చెందిన (Engineering Students) ముగ్గురు ఇంజనీరిం గ్ యువతులు కీర్తన (21), నిశిత (21), పార్వ తీ (20) ఆదివారం ఉదయం (Vazco beach resort) వాజ్కో బీచ్ రిసార్ట్ కు వెళ్లారు. స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటు మునిగిపోయారు.

మొదట ఓ యువతి స్వి మ్మిం గ్ పూల్ లోతులోకి వెళ్లగా, ఆమెను  రక్షిం చేం దుకు మిగిలిన ఇద్దరు లోతుగా ఉన్న ప్రాం తం లోకి వెళ్లారు. ఆమెను డెక్కుకు చేరడానికి వారు తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోవడంతో చివరికి మృత్యువాతపడ్డారు.

దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో  వైరల్‌ అవుతోంది. వారు మునిగిపోయే సమయంలో ఆ స్విమ్మింగ్ ఆవరణలో రిసార్ట్ సిబ్బంది ఎవరూ కూడా లేనట్లుగా సీసీ ఫుటేజ్ వీడియోలో కన్పిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు.

పూల్ వద్ద లైఫ్‌ గార్డులు, ప్రాణాలను రక్షించే పరికరాలు, పూల్ లోతును సూచించే స్పష్టమైన సంకేతాలు లేవని పోలీసుల విచారణతో తేలింది. రిసార్ట్ ఓనర్, మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

You may also like
mh deputy cm ajit pawar dies in flight accident
విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం మృతి!
kerala influencer arrested
కేరళ ఘటన: ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్!
kerala man dies
బస్సులో అసభ్యంగా తాకాడాని ఆరోపిస్తూ మహిళ వీడియో.. చివరికి..!
wife kills husband
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions