Threat Message Ahead Of India Vs New Zealand Match| ఇండియా – న్యూజిలాండ్ ( India Vs New Zealand ) మ్యాచ్ సందర్భంగా దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటాయని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒక గుర్తు తెలియని ఆగంతకుడు ‘ఎక్స్’ ( X ) (ట్విట్టర్) లో ముంబై ( Mumbai ) పోలీసులకు బెదిరింపులతో కూడిన మెసేజ్ ( Message ) ను పంపించాడాని తెలిపారు పోలీసు అధికారులు.
వరల్డ్ కప్ ( World Cup ) లో భాగంగా బుధవారం నాడు ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య సెమి ఫైనల్ ( Semi-Final ) మ్యాచ్ జరగనుంది. ముంబాయి లోని వాంఖేడే స్టేడియం ( Wankhede Stadium ) వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.
ఇండియా న్యూజిలాండ్ ల మధ్య జరగనున్న తొలి సెమీస్ కు ఫూట్ బాల్ ( Foot Ball ) స్టార్ డేవిడ్ బెహ్రామ్ ( David Beckham ), సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, నీతా అంబానీ, హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) తదితరులు ముఖ్య అతిధులుగా హాజరవ్వనున్నారు.
కాగా ఈ మ్యాచ్ ( Match ) సందర్భంగా దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటాయని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
ముంబై పోలీసులకు ఎక్స్ లో దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటాయని, తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్ ( Hand Grenade ) బుల్లెట్ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి ముంబాయి పోలీసులను ట్యాగ్ చేసాడు సదరు ఆగంతకుడు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు స్టేడియం వద్ద హై అలెర్ట్ ( High Alert ) ను ప్రకటించి, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
కాగా ఈ బెదిరింపు మెసేజ్ కు సంబంధించి మహారాష్ట్ర లోని లతూర్ ( Latur ) జిల్లాకు చెందిన 17 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.