TG Municipal Elections Schedule | తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు (Municipal Corporations), 116 మున్సిపాలిటీలకు (Muncipality) ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది.
మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో ఈ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
జనవరి 30న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా, 31న పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైన 12న నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకుంటారు.









