Telangana Liberation Day | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 న ఏటా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
ఇందులో భాగంగా బుధవారం పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం సైనిక అమరవీరులకు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్నాథ్ సింగ్..నిజాం పాలనలో రజాకార్ల అనేక దారుణాలకు ఒడిగట్టారని గుర్తుచేశారు. వారి దారుణాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత మూలంగా హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం జరిగిందన్నారు.
పటేల్ ముందు నిజాం రాజు తన ఓటమిని ఒప్పుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు మ్









