Wednesday 14th May 2025
12:07:03 PM
Home > తాజా > త్వరలో అమ్మ ఆదర్శ పాఠశాలలు ప్రారంభం: కేబినెట్ నిర్ణయం!

త్వరలో అమ్మ ఆదర్శ పాఠశాలలు ప్రారంభం: కేబినెట్ నిర్ణయం!

cm revath reddy

Amma Adarsha Patashala | తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం (Telangana Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అమ్మ ఆదర్శ పాఠశాలలు (Amma Adarsha Patashala) ప్రారంభం చేయనున్నట్లు మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ (CM Revanth reddy) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వయం సహాయక సంఘాలు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 600 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నట్లు, ఇప్పటికే రూ.125 కోట్లు ముందస్తుగా ఇవ్వడం జరిగిందని తెలిపారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, టాయిలెట్లు మరియు అన్ని రకాలుగా అభివృధ్ధి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలకు ప్రాధాన్యతనిస్తామని,  భవిష్యత్తులో గొప్ప మానవ వనరులను సిద్ధం చేస్తాం, ఈ మార్పును జూన్ 12న చూపిస్తామని మంత్రులు వెల్లడించారు.

You may also like
సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మన జవాన్ ను అప్పగించిన పాకిస్థాన్
“Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన
‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions