Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > పోలింగ్ రోజు సెలవు ఇవ్వాల్సిందే: సీఈవో ప్రకటన

పోలింగ్ రోజు సెలవు ఇవ్వాల్సిందే: సీఈవో ప్రకటన

vikas raj

Leave On Polling Day | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమీషన్ (Election Commission) కీలక ప్రకటన చేసింది.

నవంబర్ 30న పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంస్థలు, కంపెనీలు సెలవు ప్రకటించాలని సూచించింది.

ఉద్యోగులంతా ఓటు హక్కు వినియోగించుకునేలా యాజమాన్యాలు సెలవు ఇవ్వాలని సీఈవో వికాస్ రాజ్ (CEO Vikas Raj) ఆదేశించారు.

గత ఎన్నికల్లో 2018లో, 2019లోనూ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

ఈ మేరకు ఈ ఎన్నికల పోలింగ్ రోజు సెలవు ఇచ్చారో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

సెలవు ఇవ్వని కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పోలింగ్ నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

You may also like
Election commission
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
Election commission
బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. షెడ్యూల్ విడుదల!
ktr pressmeet
తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను వదులుకోరు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
congress brs logos
కాంగ్రెస్ గెలిచిందా.. కేసీఆర్ ఓడిపోయారా.. బీఆరెస్ ఓటమికి ప్రధాన కారణాలివే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions