Telangana Election Results Live Updates
కేసీఆర్ ఓటమి.. కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో కేసీఆర్ అనూహ్య ఓటమి చెందారు. మొదటి నుంచి బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య సాగిన పోరులో చివరికి కాషాయ పార్టీ విజయం సాధించారు. కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సమీప ప్రత్యర్థి, సీఎం కేసీఆర్ పై 6 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు
మధిరలో భట్టి ఘన విజయం..
ఖమ్మంలో కాంగ్రెస్ దూసుకుపోయింది. మధిరలో భట్టి విక్రమార్క విజయం సాధించారు.
గోషామహల్ లో రాజాసింగ్ విజయం..
తెలంగాణలో బీజేపీ తన సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుంది. గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఘన విజయం సాధించారు.
ఆర్మూర్ లో బీజేపీ ఘన విజయం
ఆర్మూర్ లో బీఆరెస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆరెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పైడి రాకెశ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. జీవన్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారు.
ములుగులో సీతక్క విజయం..
ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ ఘన విజం సాధించారు. బీఆరెస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఓటమి పాలయ్యారు.
కామారెడ్డిలో మారుతున్న రాజకీయం..
ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి. 14 రౌండ్లు ముగిసే సరికి 2100 ఓట్లతో మొదటిస్థానంలో బీజేపీ అభ్యర్థి. రెండోస్థానంలో రేవంత్, మూడోస్థానంలో కేసీఆర్
మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజయం..
బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్‌పై 30,458 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన శ్రీధర్ బాబు. మంథనిలో 5వ సారి విజయం సాధించిన శ్రీధర్ బాబు
చెన్నూరులో వివేక్ వెంకటస్వామి ఘన విజయం
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘన విజయం సాధించారు. బీఆరెస్ అభ్యర్థి బాల్కసుమన్ ఓటమి పాలయ్యారు.
బాన్సువాడలో బీఆరెస్ ఘన విజయం.. సరికొత్త చరిత్ర సృష్టించిన పోచారం
తెలంగాణ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్సువాడలో ఘన విజయం సాధించిన ఆయన ఒక సెంటిమెంట్ కి చరమగీతం పాడారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో స్పీకర్ ఓటమి చెందారు. కానీ, ఈ విజయంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ సెంటిమెంట్ ను తుడిచిపెట్టారు.
కామారెడ్డిలో కొనసాగుతున్న ఉత్కంఠ..
కామరెడ్డి నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగుతోంది. 12 రౌండ్లు ముగిసేసరికి రేవంత్ రెడ్డి 260 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి రెండోస్థానంలో, కేసీఆర్ మూడోస్థానంలో ఉన్నారు. బీజేపీ ఓట్లు క్రమంగా పెరుగుతున్నాయి.
హుజూర్ నగర్ లో ఉత్తమ్ ఘన విజయం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ లో వేముల వీరేశం ఘనవిజయం సాధించింది.
మంత్రిని ఓడించిన 26 ఏళ్ల యువతి..!
తెలంగాణ ఫలితాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. కాంగ్రెస్ గాలి విస్తున్న నేపథ్యంలో బీఆరెస్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యే లు సైతం ఎదురుగాలిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఓటమి ఎరుగని నేతగా చెప్పుకున్న మంత్రి, పాలకుర్తి బీఆరెస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు ఓటమి పాలయ్యారు. 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి యశస్విని రెడ్డి దయాకరరావు పై సంచలన విజయాన్ని సాధించారు.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘన విజయం
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీఆరెస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32800 ఓట్లతో గెలుపొందారు. మరోవైపు కామారెడ్డిలోనూ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మెదక్ లో మైనంపల్లి రోహిత్ విజయం..
మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ఘన విజయం సాధించారు. బీఆరెస్ అభ్యర్థి పద్మా దేవెందర్ రెడ్డిపై 9 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.
దుబ్బాకలో వకీల్ సాబ్ ఓటమి..
రఘునందన్ రావు ఓటమి దుబ్బాకలో బీజేపీకి షాక్ తగిలింది. వకీల్ సాబ్ రఘునందన్ రావు ఓడిపోయారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం 11వ రౌండ్ ఫలితాలు!
బిఆర్ఎస్ : 6037
కాంగ్రెస్: 4815
బిజెపి: 2384
బిఆర్ఏస్ పార్టీ లీడ్ -18634
సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి లీడ్..
6వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పై
మంత్రి జగదీష్ రెడ్డి 4166 ఓట్ల ఆధిక్యం
నల్లగొండ కాంగ్రెస్ బోణీ.. కోమటిరెడ్డి విజయం!
నల్లగొండ కాంగ్రెస్ బోణీ కొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.
బోణీ కొట్టిన బీఆరెస్..
తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లోవిజయం సాధించింది. భద్రాచలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగిన హోరాహోరి పోరులో 4466 ఓట్లతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య రెండో స్థానంలో నిలిచారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్ పేట్ నియోజకవర్గంలో బీఆరెస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించారు.
షాద్‌నగర్ లో కాంగ్రెస్ ఆధిక్యం
12వ రౌండ్ వ రౌండ్ ముగిసే సరికి..
అంజయ్యయాదవ్ (బిఆర్ఎస్) – 42381
అందెబాబయ్య (బిజెపి)- 4163
బీఎస్పీ ప్రశాంత్ (బిఎస్పి)- 1526
వీర్లపల్లి శంకరయ్య (కాంగ్రెస్)- 43788
విష్ణు వర్ధన్ రెడ్డి (AIFB) – 17297
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకంజ
మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లిపై, కాంగ్రెస్ అభ్యర్ధి యశస్విని రెడ్డి లీడ్‌లో ఉన్నారు. దాదాపు 5 వేల ఓట్లు లీడ్‌లో ఉన్నారు. ఆరు సార్లు వరుసగా గెలిచిన మంత్రి ఎర్రబెల్లి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. కానీ 26 ఏళ్ల యశస్విని రెడ్డిపై ఆయన వెనకంజలో ఉండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.
భూపాలపల్లి లో ఆరో రౌండ్ ఫలితాలు
కాంగ్రెస్: 6292ఓట్లు
బీఆర్ఎస్: 3598 ఓట్లు
కాంగ్రెస్ ఆధిక్యం: 2694
మొత్తం ఆధిక్యం: 13,666
రామగుండం లో కాంగ్రెస్ విజయం
మక్కన్ సింగ్ ఠాకుర్ భారీ మెజారిటీతో ఘన విజయం
హుస్నాబాద్ లో కాంగ్రెస్ లీడ్
పదవ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 7791 ఓట్ల ఆధిక్యం
కాంగ్రెస్ (పొన్నం ప్రభాకర్) – 5060
బిజెపి (బొమ్మ శ్రీరామ్) – 553
బీఆర్ఎస్ (వొడితల సతీష్) – 3462
తెలంగాణలో కాంగ్రెస్ రెండో గెలుపు సాధించింది.
ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియపై కోరం కనకయ్య విజయం సాధించారు. దీంతో తొలి రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది.
కామారెడ్డి 8వ రౌండ్లో బీజేపీకి ఆధీక్యం..
కాంగ్రెస్ : 3722
బీఆరెస్: 3637
బిజెపి : 3753
ఆధిక్యం : బిజెపి 31 అధిక్యం
రెండో బోణీ కొట్టిన కాంగ్రెస్
భద్రాద్రి జిల్లా ఇల్లెందులో కోరం కనకయ్య విజయం
తొలి విజయం సాధించిన కాంగ్రెస్..
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెలువడింది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ఖాతా తెరిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆదినారాయణ విజయం సాధించారు. బీఆరెస్ అభ్యర్థి పై 28, 358 ఓట్ల మెజారిటీ తో ఆయన గెలిచి కాంగ్రెస్ కు ఖాతా తెరిచారు.
అంబర్ పేట్ లో బీఆర్ఎస్ ముందంజ: 10681
8th రౌండ్ ముగిసేసరికి
బీఆర్ఎస్- 32561
బీజేపీ – 21880
కాంగ్రెస్ – 9021
నోటా – 759 నమోదు
నకిరేకల్ లో ఏడు రౌండ్లు ముగిసే సరికి
కాంగ్రెస్ : 38843
బిఆరెస్ 20011
కాంగ్రెస్ 18832 ఓట్ల ఆధిక్యం
మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ..
7వ రౌండ్ లో..
పద్మాదేవేందర్ రెడ్డి 3863
మైనంపల్లి రోహిత్ 3493
పంజా విజయ్ కుమార్ 68
7వ రౌండ్ ముగిసే వరకు మైనంపల్లి రోహిత్ రావు మెజార్టీ 5788
అంబర్ పేట్ లో బీఆరెస్ ముందంజ.
6వ రౌండ్ ముగిసేసరికి
బిఆర్ఎస్: 3354
బిజెపి: 2966
కాంగ్రెస్: 1169
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ
13వ రౌండ్ ముగిసేసరికి 15000 ఓట్ల మెజార్టీతో బీర్ల ఐలయ్య
మునుగోడు నియోజకవర్గం అయిదు రౌండ్లు ముగిసే సరికి
7121 ఓట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
కాంగ్రెస్ 24483
బిఆరెస్ 17362
బీజేపీ 11452
సీపీఎం 948
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం 4th రౌండ్ ఫలితాలు!
981 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి
బిఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి 3029
బీజేపీ రామరావు పటేల్ పవార్ 4010
కాంగ్రెస్ భోస్లే నారాయణ రావు పటేల్ 722
3rd Round ముగిసే సమయానికి చేవెళ్ల అసెంబ్లీ కౌంటింగ్ అప్డేట్!
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య:- 10430
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేనా భీమ్ భారత్:- 8351
బీజేపీ పార్టీ అభ్యర్థి కె ఎస్ రత్నం:- 4889
2079 ఓట్ల ముందంజలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య
4వ రౌండ్ లో ఆధిక్యంలో BRS అభ్యర్థి దేవిరెడ్డీ సుదీర్ రెడ్డి
బిఆర్ఎస్ 7660: లిడ్ – 2643
కాంగ్రెస్ 4727
బీజేపీ 5017
ఆధిక్యంలో BRS అభ్యర్థి 5640
మిర్యాలగూడ నియోజకవర్గంలో మూడో రౌండ్ లో కాంగ్రెస్ ముందంజ.
మొత్తం ఓట్లు
కాంగ్రెస్ – 16154
బిఆర్ఎస్ – 11644
నాల్గోవ రౌండ్లో దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి 5330 ఓట్లతో ముందంజ.
మునుగోడు నియోజకవర్గంలో మూడో రౌండ్ లో కాంగ్రెస్ ముందంజ
కాంగ్రెస్ లీడ్ -3658
మొత్తం ఓట్లు
కాంగ్రెస్ – 13775
బిఆర్ఎస్ – 10117
ఆలేరు నియోజకవర్గం ఐదో రౌండ్ పూర్తయే సరికి 5900 ఓట్ల ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య. సూర్యాపేట మినహ నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ లీడింగ్. నకిరేకల్ 3వ రౌండ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం 7472 లీడ్.
భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ రెడ్డి 4వ లో 473 ఆధిక్యం
మొత్తం 4131 ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ రెడ్డి.
మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ముందంజ. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెనుకంజ.
కొడంగల్ నియోజకవర్గంలో 7వ రౌండ్లు పూర్తి. 8 వేల పైగా ఓట్ల ఆధిక్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
కామారెడ్డిలో నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ముందంజ. రెండోస్థానంలో రేవంత్, మూడో స్థానంలో కేసీఆర్.
నాంపల్లి లో ఫిరోజ్ ఖాన్, మేడ్చల్ లో మల్లారెడ్డి ఆధిక్యం…
మంత్రి, మేడ్చల్ బీఆరెస్ అభ్యర్థి మల్లారెడ్డి ఏకంగా 10 వేల ఓట్ల ఆధిక్యంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి వజ్రేష్ యాదవ్ రెండోవ స్థానంలో కొనసాగుతున్నారు.
ఎంఐఎం కంచుకోట అయిన నాంపల్లి లో కాంగ్రెస్ అభ్యర్ధి ఫిరోజ్ ఖాన్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గజ్వెల్ లో బీఆరెస్ అధినేత కేసీఆర్ భారీ తేడాతో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు ఆయన పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డి స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఎల్బీ నగర్ లో బీఆరెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ముందంజ.
కరీంనగర్ లో ఆధిక్యంలో మంత్రి గంగుల కమలాకర్. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెనుకంజ.
హుజూరాబాద్ లో రెండో రౌం డ్ లోనూ ఆధిక్యం లో పాడి కౌశిక్ రెడ్డి..
బీఆర్ఎస్ – 3911
కాం గ్రెస్ – 3758
బిజేపి – 2199
మూడో రౌండ్ లో గోషా మహల్ లో బీజేపీ అభ్యర్థి వెనుకంజ.
ఖైరతాబాద్ లో 500 ఓట్లతో బీఆరెస్ అభ్యర్థి దానం ముందంజ.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో కనిపించిన హస్తం గాలి.. తొలి రెండు రౌండ్లలో కూడా వీస్తోంది.
ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది.
కాగా, హైదరాబాద్‌లో కారు జరు కొనసాగుతోంది. కీలక స్థానాల్లో కూడా కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.
ఖమ్మంలో దాదాపుగా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో కొనసాగుతోంది. ఖమ్మంతో పువ్వాడ వెనుకంజలో కొనసాగుతుండగా.. తుమ్ముల ముందంజలో ఉన్నారు.
ఇటు ఎవ్వరూ ఊహించని విధంగా సిరిసిల్లలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతుంది. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో మొదటి రౌండ్‌లో వెనుకంజలో ఉన్నారు. ఇటు కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో సైతం రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు.