- భద్రత పెంచిన రేవంత్ ప్రభుత్వం!
Stranger Enters Into MP House | మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలో ఆగంతకుడు ప్రవేశించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని ఎంపీ ఇంట్లోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు.
ముఖానికి ముసుగు, గ్లౌజులు ధరించిన దుండగుడు ఇంట్లోకి చొరబడి కిచెన్, హాల్, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోపలికి వచ్చాడు. దాదాపు గంటపాటు ఇళ్లంతా తిరిగాడు. అది గమనించిన సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ విషయాన్ని ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా డీకే అరుణకు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో తన అనుమానాలకు ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉందనీ, తనకు వెంటనే భద్రత పెంచాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎంపీ డీకే అరుణకు భద్రత పెంచాలని పోలీస్ శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.