Thursday 1st May 2025
12:07:03 PM
Home > తాజా > SSMB 29: మహేశ్ బాబు – రాజమౌళిసినిమా ప్రారంభం?

SSMB 29: మహేశ్ బాబు – రాజమౌళిసినిమా ప్రారంభం?

SSMB29 Movie Pooja Ceremony | హైదరాబాద్: తెలుగు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే భారీ ప్రాజెక్ట్ “SSMB 29” సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. హీరో మహేశ్ బాబు (Mahesh babu) కూడా ఈ వేడుకలో పాల్గొన్నట్లు పలు వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే సినిమా ప్రారంభంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈ సినిమాను వేసవి నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. సినిమా మొత్తం ఒకే భాగంగా వచ్చేలా లేదా రెండు భాగాల్లో విడుదల చేసే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఈ చిత్రంలో పలు కీలక పాత్రలు పోషిస్టున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంతో ఈ సినిమా సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

You may also like
‘ముద్దిస్తావ అన్నాడు..ఎదురైన ఘటనను చెప్పిన నటి మాళవికా’
Jahnvi kapoor
మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
‘బద్రీనాథ్ ఆలయం పక్కనే నాకూ ఓ గుడి ఉంది’
‘నా కారు దొంగిలించారు..తండ్రి ఇంటిముందు బైఠాయించిన మనోజ్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions