Monday 16th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మిగ్‌జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది

మిగ్‌జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది

South Central Railway has canceled 18 more trains in the wake of Migjam cyclone

మిగ్‌జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
మిగ్‌జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఈ నెల 8న నడవాల్సిన న్యూ తిన్‌సుకియా – బెంగళూరు (22502), న్యూ జాల్పాయ్‌గురి – చెన్నై సెంట్రల్‌ (22612), న్యూ తిన్‌సుకియా-కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ (22502) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. 09న నడవాల్సిన అగర్తలా-ఎస్‌ఎంవీటీ (12504) రైళ్లతో నడవాల్సిన చెన్నై సెంట్రల్‌ -తిరుపతి (16203), తిరుపతి – చెన్నై సెంట్రల్‌ (16204), చెన్నై సెంట్రల్‌-శ్రీమాత వైష్ణోదేవి కత్రా (16031) రద్దు చేసింది.
చెన్నై సెంట్రల్‌-విజయవాడ (20677), విజయవాడ – చెన్నై సెంట్రల్‌ (20678), చెన్నైసెంట్రల్ ‌ – విజయవాడ (20678), చెన్నై సెంట్రల్‌-తిరుపతి (16057), తిరుపతి – చెన్నై సెంట్రల్‌ (16058), తిరుపతి-చెన్నై సెంట్రల్‌ (16057), తిరుపతి – చెన్నై సెంట్రల్‌ (16058), చెన్నై సెంట్రల్‌ – తిరుపతి (16053), తిరుపతి – చెన్నై సెంట్రల్‌ (16054), చెన్నై సెంట్రల్‌ -విజయవాడ (12077), విజయవాడ – చెన్నై సెంట్రల్‌ (12078), చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ (12603), చెంగల్‌పట్టు -కాచిగూడ (17651) రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వివరించింది.

You may also like
ఇది ఏ తరహా పరిపాలనకు నిదర్శనం బాబుగారూ?
kcr
హలో కులకర్ణి.. ఆరోగ్యం ఎట్లుంది? కార్యకర్తకు కేసీఆర్ పరామర్శ!
ktr pressmeet
‘పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా?’: కేటీఆర్!
children
వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions