Samantha Post On Rana | టాలీవుడు నటుడు రానా (Rana), నటి సమంత (Samantha) మధ్య అన్నా చెల్లెళ్లలాంటి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఇద్దరు పలు సినీ వేదికలపై చెప్పారు.
బెంగుళూరు డేస్ తమిళ్ రీమేక్ కోసం ఇద్దరు కలిసి పనిచేసినప్పటి నుంచి వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శనివారం రానా పుట్టిన రోజు సందర్భంగా సమంత స్పెషల్ గా విష్ చేశారు. ఇన్స్టా స్టోరీస్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
“హ్యాపీ బర్త్ డే డియర్ రానా. ప్రతి పనిలోను 100శాతం కష్టపడతారు. ఆ శ్రమించేతత్వం నాలో స్ఫూర్తి నింపింది. నేను చేసే ప్రతి పనిని ఇంకా బాగా చేసేలా అది నన్ను ప్రేరేపిస్తుంది. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని వేడుకుంటున్నా” అని సమంత రాసుకొచ్చారు.