Samantha Inst Post | బాలీవుడ్ (Bollywood) లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న నటి సమంత సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. తరచూ అభిమానులతో తనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను పంచుకుంటారు.
తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మూడు రోజులు తాను ఫోన్ కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఆ అనుభవాన్ని తన అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు.
“మూడు రోజులు మౌనంగా ఉన్నాను. ఫోన్ లేదు. ఎవరితోనూ ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నేను నాతో మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండటం చాలా కష్టమైన విషయం.
భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండటాన్ని నేను ఇష్టపడతాను. మిలియనీర్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి” అంటూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ చేసిన సమంత అందులోనూ మహిళా ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. ఆమె, వరుణ్ ధావన్ కీలకపాత్రల్లో నటించిన ‘సిటడెల్: హనీ బన్నీ’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత ఆదిత్యరాయ్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ‘రక్త బ్రహ్మాండ్’ లో నటిస్తున్నారు.
https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/3571866818985428149/?hl=en