- తెలంగాణ ఎన్నికలపై రేవంత్ రెడ్డి అంచనా!
Revanth Reddy On TS Polls | అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ (Exit polls) ఫలితాలు వెలువడ్డాయి. అత్యధిక పోల్స్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) వైపే మొగ్గు చూపాయి.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy).
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీఆరెస్ (BRS Party)కి 25 కంటే మించి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
అంతేకాకుండా కామారెడ్డి (Kamareddy)లో కూడా కేసీఆర్ ఓడిపోబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ ఓడిపోతుందనే ముందస్తు సమాచారం తోనే కేసీఆర్ తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, నేటి నుండి సంబరాలు చేసుకోవొచ్చని ఆశాభావం వ్యక్తపరిచారు.
రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము కేసీఆర్ మాదిరిగా నిరంకుశంగా వ్యవహరించమని, అలాగే ప్రజల సమస్యలను చూపించే మీడియాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని హామీ ఇచ్చారు.