Rahul Gandhi on BC Reservations Issue | 50% రిజర్వేషన్ల పరిమితి అనే గోడను బద్దలు కొడుతాం అని ప్రకటించారు లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ.
అలాగే ఇంగ్లీష్ విద్యను పిల్లలకు నేర్పాలని నొక్కిచెప్పారు. ఇంగ్లీష్ విధ్యే విద్యార్థుల విజయాన్ని నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కులగణన సర్వే వివరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలకు వివరించారు.
అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. కులగణన సర్వేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర నాయకులు అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని కితాబిచ్చారు. ఎలా చేస్తారు అని తాను సందేహ పడ్డానని, కానీ అత్యంత స్ఫూర్తిదాయకంగా సర్వేను నిర్వహించినట్లు అభినందించారు.
దేశంలో కులగణన సర్వేలకు తెలంగాణ కులగణన సర్వే స్ఫూర్తి గా నిలిచిందన్నారు. బిజెపికి కులగణన చేయటం ఇష్టం లేదని విమర్శించారు. 50% వరకు రిజర్వేషన్లు అన్న పరిమితి గోడని బద్దలు కొట్టాలి.. కొడతాం అని రాహుల్ ప్రకటించారు.









