Pushpa 2 3D Version | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2 చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్ లలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింట్ టికెట్లు (Pushpa 2 Tickets) హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఇదిలా ఉండగా ఫ్యాన్స్ కి ఓ బిగ్ ట్విస్ట్ బయటకి వచ్చింది. పుష్ప 2ని మొత్తం ఏడు ఫార్మాట్లలో ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి 3D వెర్షన్ (Pushpa 2 3D Version) ను విడుదల చేయడం లేదట. మూవీని 3డీ వెర్షన్ కి అనుగుణంగా షూట్ చేసినప్పటికీ అందుకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి అన్ని థియేటర్లలోనూ 2డీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఇప్పటికే 3డీ వెర్షన్ లో చూద్దామని టికెట్స్ బుక్ చేసుకుంటే, ఆ షో క్యాన్సిల్ అయి 2డీ వెర్షన్లో సినిమాను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.