Friday 10th April 2026
12:07:03 PM
Home > తాజా > రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి

రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి

pramodh shetty

Pramod Shetty Comments On Rashmika Marriage | టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అయిన అభిమానులు, ఈ నెలాఖరున జరగనున్న వీరి వివాహం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వేడుకల సందడి మధ్య రష్మిక గతం గురించి మళ్ళీ చర్చకు రావడం వివాదాస్పదంగా మారింది.

గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా రక్షిత్ శెట్టి సన్నిహితుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రష్మిక పెళ్లి గురించి మీడియా ప్రశ్నించగా నాకు ఇంకా పెళ్లి పత్రిక అందలేదు.

ఒకవేళ పిలిస్తే వెళ్తాను, కానీ ఆమె మమ్మల్ని పిలవదని మాకు తెలుసు. రష్మికతో వివాహం కానందుకు రక్షిత్ ఏం బాధపడటం లేదనే విషయం అందరికీ తెలుసన్నారు. గతాన్ని తలచుకుంటూ బాధపడటానికి రక్షిత్ ఏం చిన్న పిల్లాడు కాదని వ్యాఖ్యానించారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రమోద్ వ్యాఖ్యలపై రష్మిక ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. “పెళ్లి సమయంలో పాత విషయాలను లాగడం పబ్లిసిటీ స్టంట్” అని కొందరు, “బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడిని ఎవరు పిలుస్తారు?” అని మరికొందరు రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు.  

You may also like
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
chiranjeevi
నా విజయ రహస్యం నువ్వే అని చెబుతా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
vijay and rashmika in vd14
విజయ్ రష్మిక పెళ్లి డేట్ ఇదే.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions