Poonam Kaur Post About Trivikram | నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు పరోక్షంగా వ్యాఖ్యానాలు చేస్తున్న ఆమె ఇప్పుడు నేరుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) పేరును ప్రస్తావిస్తూ బాంబ్ పేల్చారు.
తన జీవితాన్ని నాశనం చేశాడని దర్శకుడు త్రివిక్రమ్ పై మా అసోసియేషన్ ( MAA Association ) కు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నట్లు పూనమ్ కౌర్ పేర్కొన్నారు. అయినప్పటికీ దర్శకుడ్ని ప్రశ్నించడం లేదా అతనిపై ఎటువంటి చర్యలు ఇప్పటివరకూ తీసుకోలేదన్నారు.
తన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీసిన త్రివిక్రమ్ ను పరిశ్రమలోని కొందరు పెద్దలు ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.









