Ponguleti Srinivasa Reddy In Seoul | సౌత్ కొరియా ( South Korea ) రాజధాని సియోల్ ( Seoul ) పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
మరో ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ ( Political )బాంబులు పేలనున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ( Phone Tapping ), కాళేశ్వరం, ధరణి వంటి 8 నుండి పది అంశాల్లో బీఆరెస్ ( BRS ) ప్రధాన నాయకులపై చర్యలు ఉండబోతున్నట్లు సెన్సేషనల్ ప్రకటన చేశారు.
వీటికి సంబందించిన ఫైల్స్ సిద్ధమయ్యాయని, దీంట్లో ప్రధాన నాయకులే ఉన్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ( Kaleshwaram Project ) కు సంబంధించి విచారణ దాదాపు పూర్తయ్యిందని, ఫోన్ ట్యాపింగ్, ధరణి వంటి అంశాలు కూడా ట్రాక్ లో ఉన్నట్లు చెప్పారు. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరన్నారు.
సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయని, కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే చర్యలు ఉండనున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.