Pragathi Bhavan Barricades Removed | తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆయన తోపాటు మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. నేటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి ముందే రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు చేశారు.
బేగం పేట్ లోని ప్రగతి భవన్ వద్ద ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను తొలగించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పదేళ్లుగా ఉన్న కంచెలను తొలగించాలని ఇప్ప టికే పోలీసులకు ఆదేశాలు అందాయి. దీంతో గత రాత్రి నుంచి ప్రగతి భవన్ ముందు ఉన్న బ్యారికేడ్లను తొలగిస్తున్నారు.
ఓ వైపు పనులు కొనసాగుతుం డగానే ప్రగతి భవన్ ముం దున్న బ్యా రికేడ్స్ లోపలి నుం చి ట్రాఫిక్‌కు పోలీసులు అనుమతి ఇచ్చా రు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు చర్య లు చేపట్టగా జేసీబీలు, కార్మి కులతో బ్యా రికేడ్లను యుద్ధప్రాతిపాదికన తొలగిస్తున్నా రు.
బీఆర్ఎస్ అధికారం లోకి వచ్చి న తర్వా త ప్రగతిభవన్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. దీనిపై చాలాసార్లు వివాదాలు చెలరేగాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఈ కంచెను తొలగిస్తోంది.
అంతే కాకుండా ప్రగతి భవన్ ను డా. బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పాలనలో సాధారణ ప్రజలు ఎవరైనా ఈ ప్రజా భవన్‌కు రావొచ్చని.. తమ ఫిర్యాదులు స్వేచ్ఛ గా సీఎంకు చెప్పొచ్చని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.