Police Raid In Datia | ఖాకీ దుస్తులు అంటే కాఠిన్యానికి నిదర్శనంగా ముద్రపడిపోయింది కానీ.. ఆ యూనిఫాం వెనక మంచి మనసు ఉంటుందని మరోసారి నిరూపితమైంది. విధుల నిర్వహణంలో ఒ మహిళా పోలీస్ ఎంత కఠినంగా వ్యవహరించినా.. ఆమెలో ఉన్న అమ్మతనం మాత్రం దాచుకోలేకపోయింది.
విధుల్లో భాగంగా రైడ్ కి వెళ్లిన ఓ పోలీస్ బృందంలోని మహిళా అధికారి అక్కడే గుక్కపట్టి ఏడుస్తున్న తల్లికి కాసేపు తల్లయింది. లాలించి, తినిపించి, జోకొట్టి నిద్రపుచ్చింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
దటియా జిల్లాలోని ఓ గ్రామంలో కొంతమంది అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో ఓ పోలీస్ బృందం దాడి చేసింది. దీంతో ఒక కుంటుంబం తమ పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయారు. అందులో మూడు నెలల పసికందు ఆకలితో, చలితో వణుకుతూ ఇంటి పైకప్పుపై ఒంటరిగా ఉండిపోయింది.
తన పదేళ్ల అక్క ఆ బిడ్డను చూసుకుంటోంది. ఈ దృశ్యాన్ని గమనించిన సబ్‌డివిజనల్ ఆఫీసర్ ఆకాంక్ష జైన్ కు వెంటనే మనసు కరిగిపోయింది. కాసేపు పోలీసుననే విషయం పక్కనపెట్టి అమ్మలా మారిపోయింది. పసికందును తన ఒడిలోకి తీసుకుని పాలు తాగించి, వెచ్చని దుస్తులు కప్పి, నిద్రపోయే వరకు లాలించింది.
ఆ తరువాత ఆ చిన్నారిని భద్రంగా ఆ బాలికకు అప్పగించించింది. ఏదైనా అత్యవసరమైతే వెంటనే పోలీసులకు ఫోన్ చేయమని చెప్పింది. ఆకాంక్ష జైన్ ఆ చిన్నారిని నిద్రపుచ్చుత్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.









