Pawan Watches HHVM Trailer | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu). పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ ప్రకటనతో పాటు ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram)తో కలిసి ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ను వీక్షిస్తూ కనిపించారు.
ట్రైలర్‌లోని సన్నివేశాలు చూసి పవన్ ఫిదా అయ్యారు. సినిమా దర్శకుడు జ్యోతికృష్ణ వద్దకు వెళ్లి, ‘చాలా కష్టపడ్డావ్’ అంటూ ఆయన్ను ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు. మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన హరిహర వీరమల్లు చిత్రాన్ని, ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు.