Pawan Kalyan News | హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కాట్ చేస్తామని వస్తున్న డిమాండ్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.
సినిమాను బహిష్కరించినా తనకు ఇబ్బంది లేదని, తన సినిమాను బహిష్కరిస్తామని అంటున్నారంటే తాను ఎంతగా ఎదిగానో వాళ్లే చెబుతున్నారని పవన్ పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో తెరకెక్కిన హరిహర వీరమల్లు గురువారం విడుదల అయ్యింది.
ఈ నేపథ్యంలో సినిమా విజయోత్సవ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారని, హరిహర వీరమల్లు సినిమాలో జిజియా పన్నుపై సునిశితంగా చర్చించినట్లు వెల్లడించారు. ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదన్నారు.
మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చూపించినట్లు తెలిపారు. తన అభిమానులే తనకు కొండంత బలం అని అన్నారు. శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పాలని అభిమానులకు పవన్ సూచించారు.









