Wednesday 23rd July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఎన్టీఆర్, కృష్ణ పై జనసేనాని కీలక వ్యాఖ్యలు!

ఎన్టీఆర్, కృష్ణ పై జనసేనాని కీలక వ్యాఖ్యలు!

pawan kalyan

Pawan Comments on NTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ (NTR) మరియు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) లపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ మేరకు ఆదివారం భీమవరంలో నిర్వహించిన వారాహి యాత్రలో ప్రసంగించారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆనాటి హీరోలు ఎవరూ సహకరించలేదని, కొంతమంది ఎన్టీఆర్ పై విమర్శలు కూడా చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ (Congress) లో చేరారన్నారు.

కృష్ణ ఎంత విమర్శించినా ఎన్టీఆర్ ఒక్క మాట అనలేదని, అది ఆయన సంస్కారం అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. గతంలో తనకు టీడీపీకి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు ఎవరూ వ్యక్తిగతంగా దూషించలేదన్నారు. తన సినిమాలను కూడా అడ్డుకోలేదని తెలిపారు పవన్.

కానీ ప్రజలంతా అభిమానించే చిరంజీవి (Chiranjeevi), మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్ (Prabhas) లను ఇంటి ముందే కారు ఆపించి, కనీసం భోజనం కూడా పెట్టకుండా సీఎం జగన్ అవమానించారని విమర్శించారు జనసేన అధినేత. ప్రజలు ఎంతో అభిమానించే హీరోలంటే జగన్ కు కుళ్లు అని ఎద్దేవా చేశారు.

You may also like
‘వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాలు’
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’
‘ఆ ఇద్దరి వల్లే హరిహర వీరమల్లు సాధ్యం అయ్యింది’
‘కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions